అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటాం, అడ్డుకుంటే సహించం: కోమటిరెడ్డి

రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటే సహించబోమని చేసిన ప్రకటనలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. అలాంటి వారు ఐదారుగురు మాత్రమే ఉన్నారని, తమ పార్టీ కార్యకర్తలు వేలాది మంది ఉన్నారని ఆయన అన్నారు. ఘర్షణలు వద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సమైక్యవాది అయిన తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో తమ తెలంగాణ ప్రాంతానికి చెందిన తమకు ఏడాది కాలంగా మాటలు లేవని ఆయన చెప్పారు. అటువంటి రాజగోపాల్ తో కెసిఆర్ నువ్వు అక్కడ హీరో, నేను ఇక్కడ హీరో అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరు అలా మాట్లాడుకుంటే సరిపోదని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటామని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ కూడా ప్రకటించారు. కేంద్రంలో మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కెసిఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనలేదా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications