తెలంగాణపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం: తెలుగుదేశం

ప్రత్యేక తెలంగాణ సాధనలో 25న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఢిల్లీ యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తమ సత్తా ఏమిటో డిసెంబర్ 31 తర్వాత తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం శీతాకాలపు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నాగం డిమాండ్ చేశారు.
కాగా బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆందోళన కార్యక్రమానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications