జగన్ సాక్షి కోసం రూ. 600 కోట్లు వసూలు చేశాడు: శంకరరావు

P Shankar Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ అధిష్టానానికి విధేయుడిగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శంకర్రావు సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం చేసే వాఖ్యలు అయన చేయటం సరి కాదన్నారు. శాసనసభ్యుల గురించి మాట్లాడడానికి జగన విప్ కాదు అన్నారు. వారికి ఆయన ఏమైనా టిక్కెట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ మానస పుత్రిక సాక్షి పత్రికపై ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ జగన్ వల్ల బతికలేదని, కాంగ్రెస్ వల్లే ఆయన బతుకుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ శ్రేయోభిలాషుల నుండి సుమారు 600 కోట్లు రూపాయలు వసూలు చేసి సాక్షి పత్రిక పెట్టారని ఆరోపించారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో నిరూపించడానికి సిద్ధమని ప్రకటించాడు. 15 ఏళఅల క్రిందటి వైయస్ కుటుంబం ఆస్తులు ఎంత ఇప్పటి ఆస్తులు ఎంతో ప్రజలందరికీ తెలుసునన్నారు.

అలాంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్నాయన్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే వార్తలు రాయటం దారుణమన్నారు. దీంతో ప్రతిపక్ష పాత్ర పోషించినట్లుగా కనిపిస్తోందన్నారు. మంత్రులు పదవులు పోతాయనే ఓదార్పులో పాల్గొనటం లేదనటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వాఖ్యలు చేస్తే ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+