ప్రేమ పెళ్లిని అంగీకరించని తల్లిదండ్రులు: మైనరంటూ పిఎస్ లో కేసు

వరంగల్లోని ఓ కళాశాలలో బిటెక్ చదువుతున్న గుగులోత్ వెంకట్, అలౌఖ్య అనే ఇద్దరు గత కొన్నాళ్లుగా ప్రెమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవటంతో గత సెప్టెంబర్ 3న స్టేషన్ ఘనపూర్ దగ్గరలోని చిలుపూరు గుట్టలో పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిపై కేసు పెట్టారు. మైనర్ అయిన తన అమ్మాయిని అబ్బాయి బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే బిటెక్ చదువుతున్న ఆ అమ్మాయి తను మైనర్ ను కాదని, కేవలం తమను విడదీయడానికే తన తల్లిదండ్రులు మైనర్ అని కేసు పెట్టారని చెబుతోంది. తాను వెంకట్ తోనే ఉంటానని, తనకు తల్లిదండ్రులు అవసరం లేదని ఆమె నిర్మోహమాటంగా చెబుతోంది. వెంకట్ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నట్లు ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications