ఢిల్లీలో జరిగే ఎఐసిసి సదస్సుకు వైయస్ జగన్ డుమ్మా?

YS Jagan
హైదరాబాద్: ఢిల్లీలో నవంబర్ 2వ తేదీన జరిగే ఎఐసిసి సదస్సుకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పార్టీ అధిష్టానానికీ తనకూ మధ్య విభేదాలు తలెత్తడంతో ఆయన ఎఐసిసి సదస్సుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. సదస్సులో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి పార్టీ నివాళులు అర్పించనుంది. ఈ సమయంలో జగన్ ఉంటే బాగుంటుందని కొంత మంది రాష్ట్రానికి చెందిన నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. జగన్ వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఎఐసిసి సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ వర్గానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తానింకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అంటున్నారు.

కాగా, నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నవంబర్ 7వ తేదీ వరకు సాగుతుంది. ఓదార్పు యాత్రలో ఉన్నందున తాను ఎఐసిసి సదస్సుకు హాజరు కాలేకపోయానని అనిపించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నవంబర్ 7వ తేదీ తర్వాత పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత తదుపరి ఓదార్పు యాత్రను ఖరారు చేసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+