తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదంటున్న వైయస్ జగన్

కాంగ్రెసుకు చెందిన 33 మంది పార్లమెంటు సభ్యుల్లో జగన్ ఒక్కరని, అందువల్ల జగన్ తెలంగాణపై వైఖరిని చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో వైయస్ జగన్ కు అనుచరులు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారని, వైయస్ జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఓదార్పు యాత్రను కుట్రపూరితంగా అడ్డుకున్నారని, సంఘటితంగా పథకం ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అడ్డుకుందని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన తమ పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించిందని, అంతేకాకుండా తమ పార్టీ అధిష్టానం కూడా వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications