వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ సాక్షి డైలీకి వి హనుమంతరావు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు, టీవీ చానెల్ కు కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు షాక్ ఇచ్చారు. సాక్షి పేపర్, టీవీ చానెల్‌ను తాను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్ సంఘటనలో జరిగింది ఒకటైతే 'సాక్షి'లో రాసింది మరొకటని, తనపై కక్షకట్టి 'సాక్షి'లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాను నిర్వహించిన విలేకరుల సమావేశానికి తాను ఆహ్వానించకుండానే వచ్చారంటూ 'సాక్షి' బృందాన్ని ఆయన బయటకు పంపించారు. 'సాక్షి' వైఖరి మారకపోతే తానూ 'సాక్షి'ని బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిస్తానన్నారు. "సాక్షి టీమ్ పోకుంటే నేను మాట్లాడ! (సాక్షి ప్రతినిధులను ఉద్దేశించి) సారీ.. నేను మిమ్మల్ని పిలవలేదు. కాంగ్రెస్ కోసం సాక్షి పెట్టారు కానీ కాంగ్రెస్ నాయకులను తిట్టేటందుకే దాన్ని ఉపయోగిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిందొకటి, కాని సాక్షిలో మరోరకంగా రాశారు" అని అన్నారు.

"గతంలో ఆంధ్రజ్యోతి, ఈనాడులను చదవొద్దని, అవి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాస్తాయని, వాటిని చింపేయాలని వైఎస్ అనలేదా? మేము కూడా అదే అంటం..వైఎస్ బతికుంటే కూడా ఈ రాతలకు బాధపడేవారు. కాంగ్రెస్ పేరు మీద బతుకుతూ కాంగ్రెస్‌ ను తిట్టేటందుకు ఉన్నారా భాయ్ మీరు..? నేను మీతో ఇప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడను.. వెళ్లండి!" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కూడా ఆయన ఆగ్రహం ఆపుకోలేకపోయారు. "హనుమంతరావు తిట్టిండు, ఎగిరిండు, దుంకిండు.. అని రాశారు. నా పేరే హనుమంతరావు..అలా రాయడం తప్పు కదా..ఎవరెవరితోనో అమ్మను, పెళ్లాన్ని తిట్టిపిస్తరు. ఎవరు తిడ్తే దాన్ని రాస్తరు" అని ధ్వజమెత్తారు.

నాడు వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది తానేనని వీహెచ్ అన్నారు. "నేను నిన్నమొన్నటి లీడర్‌నా.. 1970 నుంచి ఉన్నా, వైఎస్ కంటే నేనే సీనియర్ని. నేనేమన్నా వారికి వ్యతిరేకం చేశానా? హైకమాండ్ ఎలా చెబితే అలా మాట్లాడతా.. ఇలాగే రాస్తే సాక్షి పేపర్ మనది కాదు భాయ్.. అని కాంగ్రెసోళ్లకు చెబుతా.." అన్నారు. "లేనిపోనివి రాయడమే ఎల్లో జర్నలిజం.. మహబూబ్‌నగర్‌లో జరిగిన దాని గురించి ఒక్క అక్షరం కూడా వాస్తవం రాశారా?" అని మండిపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X