చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి: ఆ రోజు అసలేం జరిగింది?

బాంబు పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దాడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు పేలిపోయి ఓ రాయికి తాకి పల్టీ కొట్టింది. సంఘటనా స్థలంలో మరో రెండు బాంబులు లభించాయి. అత్యంత పకడ్బందీగా రూపొందించుకున్న పథకం మేరకే నక్సలైట్లు ఈ దాడి చేశారని స్పష్టంగా అర్థమైంది. ఈ దాడిలో గాయపడిన చంద్రబాబును చికిత్స నిమిత్తం హైదరాబాదు తరలించారు. ఈ దాడిలో చంద్రబాబుతో పాటు అప్పటి ఐటి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి కూడా గాయపడ్డారు. వారంతా గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
కాగా, ఈ కేసులో ప్రస్తుత మావోయిస్టు నేతలను చాలా మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి సహా అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ, హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు 33 మందిని నిందితులుగా చేర్చారు. పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ ఆ ఆగ్రనేతల్లో ఒకరు. మిగతా నిందితులు దొరకకపోవడంతో కేసును విభజించి విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం సాగర్ తో పాటు మరో ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications