హైదరాబాద్ కేంద్ర పాలితమనే వార్తలు నిజం కాదు: దుగ్గల్

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో సహా తెలంగాణ సమస్యపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలను సూచించనుందని 'ఎకనమిక్ టైమ్స్' పత్రికలో వార్త ప్రచురితమైంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలు సూచిస్తుందని, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరగవచ్చో లాభ నష్టాలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా వివరించనుందని ఈ పత్రిక వెల్లడించింది. అదేసమయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందున్న ఆప్షన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం లేదా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ తెలంగాణ, ఆంధ్రలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది కమిటీ ముందున్న మూడో ఆప్షన్. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిని తెలంగాణ సరిహద్దులకూ విస్తరించాలనే సూచనలు ఉండటం విశేషమని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications