భార్యను పూడ్చిపెట్టిన భర్త పోలీసులకు లొంగుబాటు

నరేష్ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అదే కళాశాలలో రజని స్వీపర్ గా పనిచేస్తోంది. వారిద్దరి మధ్య ఆ మధ్య కాలంలో గొడవ జరిగినట్లు సమాచారం. నరేష్ ఓ రోజు కళాశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రజని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య శవాన్ని ఇంటి వద్ద ఖాళీ స్థలంలో వారం రోజుల క్రితం పాతిపెట్టాడు. అయితే, దాన్ని భరించలేక నరేష్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే, నరేష్ రజనిని హత్య చేసి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications