నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు వర్షం దెబ్బ

నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. చెరువు కట్టలు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని అండర్ బ్రిడ్జ్ దగ్గర భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రామలింగపురం బ్రిడ్జ్ వద్ద వాగులో బస్సు చిక్కుకుంది. అధికారులు వెంటనే అప్రమత్తమై అందులో ఉన్న ప్రయాణికులను రక్షించారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో దిగాల్సిన కింగ్ ఫిషర్ విమానం శనివారం ఉదయం వర్షం కారణంగా హైదరాబాదుకు తిరిగి వెళ్లింది. ఈశాన్య రుతుపవవనాల ప్రభావంతో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications