పొట్టి శ్రీరాములు విగ్రహాంపై దాడి చేస్తే చేతులు నరికేస్తాం: టిజి వెంకటేష్

పొట్టిశ్రీరాములును ఆర్యవైశ్యులు దేవుడిగా భావిస్తారని, అటువంటి మహాత్ముడి విగ్రహాలపై దాడి జరిగితే వారి సెంటిమెంటు దెబ్బ తింటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాయకులు గానీ వారి పిల్లలు గానీ చనిపోలేదని, అమాయకులే ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ విద్యార్థులు గుర్తించాలని ఆయన అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ దేశం రెండో రాజధానిగా గానీ ప్రకటించాలని ఆయన కోరారు. వచ్చే నెల 7వ తేదీన రాయలసీమ సైనిక్ సేవాదళ్ ఏర్పడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications