కోనేరు హంపికి అవమానం: ఆసియా క్రీడల ఎంట్రీ తిరస్కరణ

Keneru Hamphy
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెస్ క్రీడాకారిణి కోనేరు హంపికి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం లేదు. ఆమె ఎంట్రీని అఖిల భారత చెస్ సమాఖ్య తిరస్కరించింది.ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టు నుంచి తాను తప్పుకోలేదని, అఖిల భారత చెస్ సమాఖ్యే (ఏఐసీఎఫ్) తన ఎంట్రీని తిరస్కరించిందని ప్రపంచ నెంబర్ టూ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి విమర్శించింది. కోచింగ్ క్యాంప్‌నకు హాజరు కాలేదనే కారణంతో జట్టు నుంచి తొలగించటం సబబుకాదని శనివారం ఇక్కడ జరిగిన ప్రెస్‌మీట్‌లో హంపి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏఐసీఎఫ్ ప్రకటించిన భారత బృందంలో ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, హంపి పేర్లు లేని సంగతి తెలిసిందే. 2006లో దోహాలో జరిగిన ఈవెంట్‌లో హంపి రెండు స్వర్ణాలు కైవసం చేసుకుంది. చెస్ సమాఖ్య నిర్వాకం వల్లే ఈసారి పోటీల్లో పాల్గొనలేకపోతున్నానని చెప్పింది. ఈ విషయంపై కేంద్ర క్రీడల మంత్రి గిల్‌కు లేఖ రాసినా ఫలితంలేదని వాపోయింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు తాను అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గర్వంగా భావిస్తానని హంపి పేర్కొంది.'కోచింగ్ క్యాంప్‌నకు హాజరుకావాలని ఏఐసీఎఫ్ సూచించింది. ఆ సమయంలో గ్రాండ్ ప్రీ టోర్నీల్లో ఆడాల్సివున్నందున పాల్గొనలేకపోయా. అదే సాకుగా చూపి జట్టు నుంచి తప్పించారు. కోచింగ్ క్యాంప్‌నకు వెళ్లకుండానే భారత్ తరపున ఆడి పతకాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయ'ని హంపి పెర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+