ముఖ్యమంత్రి రోశయ్యకు అప్తుడైన వైయస్సార్ ప్రియమిత్రుడు కెవిపి

అధికార సమరంలో కెవిపి రామచందర్ రావు గతంలో రోశయ్యకు దూరమయ్యారు. అయితే ఇటీవలి కాలంలో రోశయ్య తీసుకునే పలు నిర్ణయాల్లో కెవిపి హస్తం ఉందనే మాట వినిపిస్తోంది. ఐఎఎస్ అధికారుల బదిలీల విషయంలో కెవిపిదే అంతిమ నిర్ణయమని అంటున్నారు. పరిశ్రమలు, నీటిపారుదల, గునులు, ఆర్థిక శాఖల్లో ఆయనది తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోందని చెబుతున్నారు. సాగునీరు, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిగా బిపి ఆచార్యను నియమించడం వెనక గతంలో కెవిపిదే ప్రధాన పాత్ర. ప్రస్తుతం ఆయనపై ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం ఆరోపణలు వచ్చినా ఆయన బదిలీ జరగడం లేదు. అందుకు కెవిపియే ప్రధాన కారణమని అంటున్నారు.
వైయస్సార్ మరణం తర్వాత గాలి ముద్దు కృష్ణమ నాయుడి వంటి ప్రతిపక్ష నాయకులే కాకుండా అధికార పక్ష నాయకులు వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, కెఆర్ అమోస్, పి. శంకర్ రావు కెవిపిపై బహిరంగ ఆరోపణలు చేశారు. కెవిపిని పక్కన పెట్టాలని శంకర రావు పదే పదే ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు. అయినా కెవిపిని దూరం పెట్టేందుకు రోశయ్య సిద్ధంగా లేరని తెలుస్తోంది. వనరుల సమీకరణలో అందె వేసిన చేయి కావడం వల్లనే కెవిపిని దూరం చేసుకోవడానికి రోశయ్య ఇష్టపడడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications