చంద్రబాబుది సమైక్యాంధ్ర జెండా: నాయిని నర్సింహారెడ్డి

Naini Narsimha Reddy
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమైక్యాంధ్ర జెండా ఎగురవేస్తారని మరోసారి రుజువు అయిందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మాజీ శాసన సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కొత్త రాగం అందుకుంటున్నారని, మంత్రి పదవులు అడ్డు పెట్టుకొని మీరు ఇలాంటి వాఖ్యలు చేస్తే బిడ్డా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. హైదరాబాద్ ను తెలంగాణనుండి విడగొట్టడానికి ఎవరూ చూసినా ఖబడ్డార్ అన్నారు. విద్రోహదినం పాటించాలని తెలంగాణలోని వారందరికి విజ్ఞప్తి చేసినప్పటికీ మంత్రులు పాల్గొలటం శోచనీయమన్నారు. వారికి తెలంగాణపై చిత్తశుద్ది లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ ప్రజల మనోభావాలను గాయపర్చిన వారికి తెలంగాణలో ఉండే హక్కు లేదన్నారు. సోమవారం అవతరణ దినోత్సవాలని నిరసిస్తూ ఆయన తెలంగాణ భవన్లో నల్లజెండాను ఎగురవేశారు.

ఆంధ్రవారితో కలిపి నవంబర్ 1వ తేదిన తెలంగాణ అన్యాయమైన రోజు కాబట్టి దీనిని విద్రోహ దినంగా పాటిస్తామన్నారు. ఆ రోజునుండి ఈ రోజు వరకు తెలంగాణకు అన్యాయం జరుగుందన్నారు. 610 జివో, పెద్దమనుషున ఒప్పందం, ఫజల్ అలీ కమిషన్ అన్నింటినీ విస్మరించి తెలంగాణను అణగదొక్కాయన్నారు. తెలంగాణవాదులను గాయపర్చేలా ఇప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వారు గుంటూరులో గుంటెడు, విజయవాడలె సెంటు భూమి ఆడగటం లేదని మా భూమి మాకు కావాలని అడుగుతున్నారన్నారు. తెలంగాణవారి ఆస్తులను కొల్లగొట్టిన కొందరు నాయకులే తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు.

మా ఉద్యోగాలు మాకు, మా నీళ్లు మాకు కావాలన్నారు. నిరంకుశ నిజాం మా నుండి బలవంతగా శిస్తులు కట్టించుకొని వీటిని కట్టించాడని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేకుంటే మేం ఏం చేయలేమని వారి ఖర్మ వారు అనుభవించాల్సిందేనని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ పత్తా లేకుండా పోతుందన్నారు. త్వరలో బ్రహ్మాండమైన బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+