సిఎం కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, ఉద్రిక్తత

తెలంగాణ ప్రాంత మంత్రులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్టేడియానికి భారీ భద్రత మధ్య చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ రాష్ట్రావతరణ దినోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాదులో రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి డికె అరుణకు కూడా నిరసన ఎదురైంది. ఆమె బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు తెలంగాణావాదులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications