చంద్రబాబు రాష్ట్రావతరణ వేడుకలకు ఇద్దరే తెలంగాణ నేతలు హాజరు

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో చంద్రబాబు నాయుడు రాష్టావతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు 1982 ముందు కన్నా అధ్వాన్న పరిస్థితులున్నాయని ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని ఆయన అన్నారు. అంతకు ముందు చంద్రబాబు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత తెలుగుతల్లి విగ్రహం వద్ద పూలు చల్లి వందనం సమర్పించారు.












Click it and Unblock the Notifications