అసమర్థ ఎంపీల వల్లే నష్ట పరిహారం పొందలేకపోయాం: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆసమర్థ పార్లమెంటు సభ్యుల వల్లనే వరద నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి పొందలేకపోయామని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం, అధికారులను ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చి పంటలు బాగా పండుతాయని రైతులు పంట విస్తీర్ణాన్ని పెంచారని, అయితే అనుకోని ఉపద్రవం తుఫాన్ రూపంలో వచ్చి వారిని నిండా ముంచిందని ఆవేదన వక్తం చేశారు.

రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ వచ్చే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. ఎలాంటి ఉపద్రవం వచ్చినా మారు ఫరవాలేదని ప్రభుత్వం, అధికారులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వారికి కిరోసిన్, బియ్యం, పప్పువంటి నిత్యావసర వస్తువులు వెంటనే సరఫరా చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతుల వివరాలను రెవెన్యూ డిపార్టుమెంట సేకరించి సహాయం అందించాలన్నారు. రైతులను కలిసి మాట్లాడానని ఆక్కడ వారి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుసుకున్నానన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి వరద సహాయక చర్యలపై ఒత్తిడి తీసుకు వస్తామని చిరంజీవి చెప్పారు. నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపుతామన్నారు. ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు ముంపు బాధితులను ఆదుకోవాల్సిందిగా సూచించానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+