కోస్తాంధ్రకు తుఫాను ముప్పు: ప్రజల్లో అలుముకున్న భయాందోళనలు

మంగళవారం రాత్రి వరకు వాయుగుండం కేంద్రీకృతమైన తీరును పరిశీలిస్తే దాని తీవ్రత, అక్కడి మేఘాల పరిస్థితి భయాందోళనలను కలిగిస్తున్నాయి. అనూహ్య పరిణామలు ఏవైనా సంభవిస్తే తప్ప అది దిశ మార్చుకుని వేరే ప్రాంతాల వైపు తరలిపోవడం, బలహీనపడే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలుల మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు అంచనా. వాయుగుండం పెను తుపానుగా మారి రాష్ట్రంలో తీరాన్ని దాటితే కోస్తాకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలు అల్లకల్లోలమై పోతాయని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల 20 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలకుతోడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. వేలాది ఇళ్లు నీళ్లలో ఉండిపోయాయి. 2,698 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. 1,508 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్లకు ఎక్కువగా నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications