పోలవరం ప్రాజెక్టుపై మొదటి నుంచీ పేచీ పెట్టడం సరి కాదు: సిఎం

రాష్ట్రానికి ముందస్తు సహాయంగా కొన్ని నిధులను పంపాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు, హోంమినిస్టర్ చిదంబరానికి లేఖ రాశాన్నారు. రాష్ట్రంలో సాధారణ వర్షం కన్నా వెయ్యి రెట్లు అధిక వర్షపాతం నమోదయిందన్నారు. వాతావరణం అనుకూలిస్తే గురువారం సాయంత్రం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తానని చెప్పారు. వరదలు, వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడానని జిల్లాల్లో పరిస్థితిపై వారితో చర్చించానని తెలియజేశారు.
మంత్రులను వెంటనే తుఫాన్ బాధిత ప్రాంతాలకు వెళ్లమని ఆదేశించారు. అవసరమైన పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. పోలవరంపై ఒరిస్సా రాష్ట్రం మళ్లీ మడత పేచీ పెట్టడం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే అన్ని విషయాలను సవివరంగా పర్యావరణ శాఖకు ఇచ్చామని మళ్లీ వారు పోలవరంపై మాట్లాడటం సరికాదన్నారు. పోలవరానికి పర్యావరణ అనుమతులు ఎప్పుడో వచ్చాయన్నారు. జైరాంరమేశ్ కు ఈ విషయమై లేఖ రాశానన్నారు. మనం వెళ్లి ఒరిస్సాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయలవలసిన అవసరం లేదన్నారు. ముంపు సమస్య లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనంతరం పర్యావరణ శాఖ అనుమతినిచ్చిందన్నారు. పోలవరానికి ఉన్న అన్ని సమస్యలు తొలగి జాతీయ హోదా వస్తుందని రోశయ్య అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications