మంత్రులపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రోశయ్య

అయితే, ముఖ్యమంత్రి కె. రోశయ్య మాత్రం మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ ఆయన విరుచుకుపడ్డారు. మంత్రివర్గంలో జరిగిన ప్రతి విషయం ఉన్నదున్నట్లుగా పత్రికల్లో వస్తోందని, మంత్రులకు సత్ప్రవర్తన ముఖ్యమని ఆయన అన్నారు. క్యారెక్టర్ లెస్ మంత్రులున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ మీద నమ్మకం లేకపోతే తమ ఫోన్లపై నిఘా పెట్టాలని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నారు. దానికి ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ అదెంత పని అని అన్నారు. ఈ సంభాషణ కూడా ఉన్నదున్నట్లుగా పత్రికల్లో వస్తుందని మంత్రి ముఖేష్ అన్నారు.












Click it and Unblock the Notifications