భావి రాజకీయ నేత వైయస్ జగనే: మేకపాటి రాజమోహన్ రెడ్డి

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం కడుపులో పుట్టిన మరో సింహం అని తెలుగు దేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన కోహినూర్ వజ్రం జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జగనే నిజమైన హీరో అని అన్నారు. తండ్రి మరణానికి శ్వాస విడిచిన వారిని ఓదార్పు పేరుతో స్వయంగా వచ్చి కలుసుకోవడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. చివరి శ్వాస వరకు జగన్ తో ఉంటానని ఆయన చెప్పారు. జల్ తుఫానా జగనన్నా అని మరో నేత వాఖ్యానించారు.

కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కాంగ్రెస్ లో వైఎస్ లేని కొరత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ భావి నాయకుడయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళతాడని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+