హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన జల్ తుఫాను గండం: తీరం దాటిన వాయుగుండం

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone
హైదరాబాద్: కోస్తా ప్రాంతానికి తుఫాను ముప్పు తప్పింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా రాష్ట్రాన్ని వణికిస్తున్న జల్‌ తుపాను సోమవారం తెల్లవారుజామున చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటింది. వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై మరో 24 గంటలు ఉంటుంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాను తీరం దాటుతున్న సమయంలో ఈదురుగాలులు మాత్రం వీచాయి. వర్షాలు, ఈదరుగాలులకు మన రాష్ట్రంలో 16 మంది మరణించారు. తమిళనాడులో మరో ఇద్దరు చనిపోయారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 10 మంది మృత్యువాతపడ్డారు(అధికారిక లెక్కల ప్రకారం నలుగురు). విశాఖ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరేసి చనిపోయారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు, తిరుమలలో మరొకరు గల్లంతయ్యారు.

పెను తుపానుగా అవతరించిన 'జల్‌' అనూహ్య పరిణామాల మధ్య ఆదివారం సాయంత్రానికి క్రమంగా బలహీనపడింది. దక్షిణ నికోబార్‌, థాయ్‌లాండ్‌ పరిసర ప్రాంతాల్లో అక్టోబరు 31న ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయానికి పెనుతుపానుగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో జలవిలయం తప్పదన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఆదివారం ఉదయం దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నానికి వాయువ్య దిశగా కదిలి చెన్నైకు 250 కిమీలు, నెల్లూరుకు 350 కి.మీ.ల సమీపానికి వచ్చిన జల్‌ 'పెను తుపాను' స్థాయి నుంచి 'తుపాను' స్థాయికి తగ్గింది. దీని ఫలితంగా వీచే గాలుల తీవ్రత కూడా తగ్గిపోయింది.

ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. 11 మండలాల్లో సముద్ర కెరటాల ఉద్ధృతి కనిపించింది. జిల్లాలోని రాజుపాలెం పల్లెపాలెంలో ఓ వ్యక్తి మరణించాడు. తమకు తుపాను ముప్పు తప్పిందని ప్రకాశం జిల్లా వాసులు వూపిరి పీల్చుకున్నారు. తుపాను ప్రభావంతో తిరుమలలో కుండపోతగా వర్షం కురిసింది. తిరుమల నడిబొడ్డున ఉన్న ఆళ్వారు చెరువులో ఓ భక్తుడు గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో 10-20 మీటర్ల మేర సముద్రం చొచ్చుకువచ్చింది. జిల్లాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లాలో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి. రేపల్లెలో అత్యధికంగా 4.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. నిజాంపట్నం ఓడరేవులో తొమ్మిదో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. విశాఖపట్నం జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు క్వారీ గొయ్యిలోకి పడి చనిపోయారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చలిగాలులకు ఓ వృద్ధురాలు చనిపోయారు. తుపాను వల్ల రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దక్షిణ మధ్య రైల్వే పలుచోట్ల కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేసింది.

తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు జల్‌ తుపానుకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్నిచోట్ల 4 సెం.మీ.ల వరకు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మరణించారు. పుదుచ్చేరిలోనూ కుండపోతగా వర్షం కురిసెంది. గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వెలుతురు తక్కువగా ఉన్నందున చెన్నైలో దిగాల్సిన 16 విమానాలను బెంగుళూరుకు మళ్లించారు. చెన్నైకి రావాల్సిన అన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులోని మూడు తీరప్రాంత జిల్లాలతో పాటు, పుదుచ్చేరిలో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X