జగన్ లో సహనం నశించాలనే హైకమాండ్ కోరుకుంటోందా?

జగన్ కు వ్యతిరేకంగా మరో కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. అధిష్టానం మాత్రం వైయస్ జగన్ వ్యవహారం పట్ల మౌనంగా ఉంటుంది. గుర్తిస్తే వైయస్ జగన్ మరింత రెచ్చిపోతారని, అందువల్ల వైయస్ జగన్ చర్యలను గుర్తించకుండా ఉండడమే మంచిదని అధిష్టానం భావిస్తూ మరో వైపు రెచ్చగొట్టేలా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని జగన్ వ్యతిరేకులతో ప్రకటనలు చేయిస్తూ జగన్ ను, జగన్ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేయడం కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications