ప్రభుత్వ శాఖల అధిపతులకు ముఖ్యమంత్రి రోశయ్య క్లాస్

మంత్రులతో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారంటూ ఆయన అధికారులను అడిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నుంచి కూడా ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం పని చేయడం లేదని, అధికారులతోనూ మంత్రులతోనూ రోశయ్య పని చేయించలేకపోతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య అధికారులతో సమావేశమయ్యారు. ఇంతకు ముందు ఆయన మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. మంత్రుల తీరుపై ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications