వైయస్ జగన్ వర్గం ధిక్కారమే: తనపై చర్యను ప్రశ్నించిన చెవిరెడ్డి

YS Jagan
హైదరాబాద్: పార్టీ నాయకత్వంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తిరుగుబాటుకే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తనపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) క్రమశిక్షణా సంఘం చర్యకు సిఫార్సు చేయడంపై ఆయన బుధవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను వైయస్ జగన్ వెంటే ఉంటానని, భయపడేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గాన్నే పార్టీ నాయకత్వం టార్గెట్ చేస్తోందని, అలా ఎందుకు టార్గెట్ చేస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారని, అది పూర్తిగా వ్యక్తిగత యాత్ర అని ఆయన చెప్పారు. వైయస్ జగన్ మాత్రమే ప్రజల్లో ఉండగలిగే నాయకుడని ఆయన అభిప్రాయపడ్డారు. తానేమీ ద్రోహం చేయలేదని, పార్టీ తనపై కక్ష గట్టి చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. నాయకత్వ చర్యలకు తామేమీ భయపడడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+