దుగ్గల్ కు సుబ్బిరామిరెడ్డి విందు అనుమానాలకు తావిస్తోంది: హరీష్ రావు

ప్రభుత్వం సీమాంధ్ర వరదల పంట నష్టాన్ని అంచనా వేసినట్టుగానే తెలంగాణ జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలోని చాలామంది రైతులు వర్షాల వల్ల పంటను నష్టపోయారని, ప్రభుత్వం వారని వెంటనే ఆదుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ద్వందనీతిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలమంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు. 610 జీవో ప్రకారం వెంటనే ఎస్సై, సిఐలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications