రాజా ఉద్వాసనకు కాంగ్రెసు ఒత్తిడి: మొండికేస్తున్న రాజా

A Raja
న్యూఢిల్లీ: టెలికం మంత్రి రాజా ఎ రాజా ఉద్వాసనకు కాంగ్రెసు నాయకత్వం డిఎంకె నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అయితే రాజాకు కరుణానిధి నుంచి మొక్కవోని మద్దతు లభిస్తోంది. రాజా వ్యవహారంపై పార్లమెంటు సమావేశాలు స్తంభిస్తున్నాయి. సమావేశాలను కొనసాగించడం ఎలానో అధికార కాంగ్రెసుకు అంతు చిక్కడం లేదు. దీంతో కాంగ్రెసు నాయకత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. లక్షా 70 వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని కంప్ట్రోలర్ అడిటర్ జనరల్ తప్పు పట్టినా రాజాను కేంద్ర ప్రభుత్వం కూడా వెనకేసుకొస్తోంది. అయితే, అది ఎంత కాలం సాగుతుందనేది తెలియడం లేదు.

రాజా స్థానంలో మంత్రివర్గంలో చేర్చుకోవడానికి డిఎంకె నుంచి మరో పేరును సూచించాల్సిందిగా కరుణానిధిని కోరాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించుకుంది. దీనిపై కాంగ్రెసు నాయకత్వం గురువారం సుదీర్ఘంగా మంతనాలు జరిపింది. 2011 ఏప్రిల్ లో తమిళనాడు శాసనసభా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజా ఉద్వాసనకు కరుణానిధి విముఖంగా ఉన్నారు. అయితే, అన్నాడియంకె నేత జయలలిత మాత్రం రాజా వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజాకు ఉద్వాసన చెప్తే యుపిఎ ప్రభుత్వం పడిపోతుందంటే తాను ఆదుకుంటానని, యుపిఎకు మద్దతు సమీకరించి పెడతానని ఆమె కాంగ్రెసు నాయకత్వానికి చెబుతున్నారు.

అయితే, తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజా కూడా మొండికేస్తున్నారు. తాను రాజీనామా చేయబోనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజా ఉద్వాసనకు కరుణానిధి అంగీకరించకపోతే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+