తెలంగాణను ఎవరూ తాకట్టు పెట్టలేరు: కెసిఆర్ పై గద్దర్

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వివిధ ప్రాంతాల అభిప్రాయాలను మాత్రమే ఇవ్వగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కెసిఆర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు తాము పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు సార్లు తెలంగాణను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ పట్ల తెలుగుదేశం, కాంగ్రెసు రెండు పార్టీలు ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications