తెలంగాణ రాదనే అనుకుంటున్నా!: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి

తుఫాను బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని చిరంజీవి ధ్వజమెత్తారు. పునరావాసం కల్పించటంలోగానీ, ఆహారపదార్థాల్ని సరఫరా చేయటంలోగాని మరే విషయంలోగాని ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో పార్లమెంటు సభ్యులు అలసత్వం ప్రదర్సిస్తున్నారని మరోసారి ఎంపీలపైన ధ్వజమెత్తారు. ఎంపీలందరూ కూడా సొంతపనులు, లాభీయింగ్ లకే పరిమితమవుతున్నారని జైరాం రమేష్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడై ఉండి కూడా ఆయన రాష్ట్రంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఆయన పోలవరం ప్రాజెక్టుపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు.












Click it and Unblock the Notifications