మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత: చంద్రబాబు సంతాపం

దండు తెలుగుదేశం పార్టీ హయాంలో దేవాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శివరామరాజుకు వారసులు ఎవరూ లేకపోవటంతో ఆయన తన ఆస్తులను ధారాదత్తం చేశారు. ఆయన వయస్సు 72. శివరామరాజు గతంలో రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా, మూడుసార్లు శాసనసభ్యుడిగా పని చేశారు. దండు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications