బెజవాడ సీపీ రామాంజనేయులుపై టీడీపీ వల్లభనేని వంశీ ఫైర్

Vallabhaneni Vamsi
విజయవాడ: రాజకీయ మైలేజీ కోసం రాద్ధాంతం చేయాల్సిన అవసరం నాకు గాని, తెలుగుదేశం పార్టీకిగాని లేదని ఆ పార్టీ విజయవాడ నేత వల్లభనేని వంశీ విజయవాడ సిపి సీతారామాంజనేయులుపై ధ్వజమేత్తారు. కౌన్సెలింగ్ పేరుతో బాజీని పిలిపించి మాట్లాడిన సిపి దేవినేని నెహ్రూను పిలిపించి ఎందుకు మాట్లాడలేకపోయారన్నారు. తనకు విజయవాడలో ప్రాణహాని లేదని సిపి చెబుతున్నాడని, అంటే హైదరాబాదులో నాకు ప్రాణహాని ఉన్నట్లా అని ప్రశ్నించారు.

నాకు హైదరాబాదులో ఏదైనా ప్రాణహాని జరిగితే ఆ బాధ్యత విజయవాడ సిపికి ఉండదా అన్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందని, కాని ప్రాణభయం లేదన్నారు. నెహ్రూ, ముసునూరి సుబ్బారావు, అరవ సత్యంలను పిలిపించి మాట్లాడని సిపి తెలుగుదేశం నాయకులను కౌన్సిలింగ్ పేరుతో పిలవటం వెనుక నెహ్రూ రాజకీయ ప్రయోజనాలు కాపాడటం కోసమేనా అని ప్రశ్నించారు.

విజయవాడ సిపి రామాంజనేయులు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు బాడీగార్డులను ఉపసంహరించున్న విషయం తెలిసిందే. దేవినేని ఉమకు కొందరు బాడీగార్డులను ఉపసంహరించిన సిపి, వల్లభనేని వంశీకి మాత్రం మొత్తానికి మొత్తం ఉపసంహరించాడు. దీంతో వల్లభనేని సిపిపై నిప్పులు గక్కాడు. సిపి నెహ్రూకి వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+