దేశ చరిత్రలో ఇలాంటి అవినీతిపరుడు లేడు: వెంకయ్యనాయుడు

కాగ్ నిగ్గు తేల్చిన 2జీ స్పెక్ట్రమ్, ఆదర్శ్ సొసైటీ, కామన్వెల్త్ క్రీడల్లో అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ తమ నాయకులు చేస్తున్న అవినీతిని వెనకేసుకొస్తూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందన్నారు. 2జి స్పెక్ర్ విషయంపై ప్రభుత్వం వెంటనే ఎంక్వయిరీ వేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటును స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. అదర్శ్ కుంభకోణంలో ముఖ్యమంత్రిని మార్చగానే అవినీతి మాసిపోయినట్టు కేంద్రం భావిస్తుందని విమర్శించారు.దేశానికి అవసరమైన ధాన్యాన్ని ఉంచుకొని మిగతా ధాన్యం ఎగుమతికి అనుమతించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాజకీయాలను పక్కనబెట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాన్నారు.












Click it and Unblock the Notifications