హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి ఉద్రిక్తంగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం తేలేవరకు ఎస్ఐ పోస్టులు భర్తీ చేయవద్దని డిజిపి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేసి అరెస్టు చేసినందుకు నిరసనగా వారు విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీలో కొందరు విద్యార్థులు రెచ్చిపోయి రెండు బస్సులపై దాడి చేసి బస్సు అద్దాలను పగలగొట్టారు. ర్యాలీ చేస్తున్న విద్యార్థులు తార్నాక వైపు వెళ్లారు.

ఎస్ఐ రాత పరీక్షలను ఆపాలంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి అరెస్టు చేయటాన్ని వారు ఖండించారు. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ఐకాస అధ్యక్షుడు రాజారాంయాదవ్, ఓయుఐకాస అధ్యక్షుడు మర్రి అనీల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా ఒత్తిడి తీసుకు రావాలని మంత్రులను, శాసనసభ్యులను వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ పోస్టులపై ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

కాగా ఎస్ఐ రాత పరీక్షల నిర్వహించటం, నిర్వహించక పోవటం నా చేతుల్లో లేదని డిజిపి అరవిందరావు అన్నారు. అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి దామోదరరెడ్డి, తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ నాంపల్లిలో అరెస్టయిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను విడుదల చేయాలని పోలీసులతో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X