హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
Districts
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: హైదరాబాదులోని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వీరి కళ్లల్లో కారం చల్లి బండరాయితో మోది అతి కిరాతకంగా హతమార్చారు. మృతుల్లో ఒకరు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన బాలరాజుగా, మరో వ్యక్తిని అతడి బంధువైన కిషన్‌గా గుర్తించారు.
ఓ థియేటర్ సెల్లార్ తవ్వకం కాంట్రాక్టు పనుల్లో చోటు చేసుకున్న ఘర్షణలే ఈ హత్యలకు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.