నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు జిల్లాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Heavy Rains
నెల్లూరు: నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలం విందూరు వద్ద కైవల్య నది ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలోని 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపురం వద్ద 4 అడుగుల మేర కైవల్య నది ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలోని రాపూరు-కడప మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వెంకటగిరి - యేర్పేడు మార్గంలో పొంగూరు వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కనిగిరి రిజర్వాయర్ లో కూడా నీట మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఎస్పీ ప్రజలను కోరుతున్నారు. బోగ సముద్రం వాగులో ఏడుగురు కొట్టుకుని వచ్చారు. ఓ చెట్టును పట్టుకుని తమను రక్షించాలని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్‌కు నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ఉద్ధృతి కారణంగా ఆదరం, జయలక్ష్మీపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలో కూడా ఎడ తెగకుండా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడులో తీరాన్ని దాటింది. తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X