పోలవరం ప్రాంతీయ ప్రాజెక్టు కాదు: రాజమండ్రి ఎంపీ ఉండవల్లి

అయితే తాము పోలవరం జాతీయ హోదాకో మరెందుకో పోరాడటం లేదని దానిని త్వరగా ప్రారంభించాలన్నారు. పోలవరం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతమంచిదన్నారు. పోలవరంపై ఇందిరా సాగర్ లిఫ్టు, రాజీవ్ సాగర్ లిఫ్టు, ప్రాణహిత, చేవెళ్ల వంటి ఎనిమిది ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయన్నారు. పోలవరం ఒక్కటే గ్రావిటీ ప్రాజెక్టు కాగా దానిపై ఆధారపడి ఉన్న ఎనిమిది ప్రాజెక్టులు లిఫ్టు చేసేవని చెప్పారు. ఆయా ప్రాజెక్టులకు పోలవరం నుండి విద్యుత్ ను ఉచితంగా ఇవ్వవచ్చునని చెప్పారు. పోలవరం ఆగిపోతే రాష్ట్రంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తే పెట్టుబడులు వెంటనే రాబట్టవచ్చునని తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండోళ్లలోనే పూర్తి చేయవచ్చునని చెప్పారు. ఇది దేశానికే వరప్రసాధమన్నారు. పోలవరం నిర్వాసితులకు దేశంలో ఎవరూ ఇవ్వని పరిహారం అందిచామన్నారు. వైయస్ హయాంలో ఎస్ఆర్ రెట్లు గిట్టుబాటు లేక టెండర్లకు స్పందన రాలేదని చెప్పారు.
వ్యవసాయానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత నిచ్చారని ఉండవల్లి అన్నారు. వ్యవసాయం దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యమని వైయస్ భావించేవారన్నారు. వ్యవసాయం ఉండాలంటే నీటిపారుదల ముఖ్యమని వైయస్ భావించినందువల్లే భారీ ప్రాజేక్టుల నిర్మాణానికి పూనుకున్నాడని చెప్పారు. పోలవరం నిర్మించాలనే తలంపు ఇప్పటిది కాదని, కాటన్ గారు 1943లోనే పోలవరం నిర్మించాలని సూచించినట్టు చెప్పాడు. పోలవరం నిర్మాణం ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో 2 లక్షల నుండి 20 లక్షలు, జనవరి నెలలో 3లక్షల క్యూసెక్కుల నీటిని కాపాటడుకోవచ్చునన్నారు.












Click it and Unblock the Notifications