సత్యసాయి జన్మదిన వేడుకలలో ప్రధాని మన్మోహన్ సింగ్

మంగళవారం సత్యసాయిబాబా 85వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాయిబాబు జన్మదినం ఘనంగా జరుపుతారు. ప్రధాని మన్మోహన్ అధికారికంగా సత్యసాయి జన్మదినోత్సవంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాల్గొన్నారు. ఈసారి సతీసమేతంగా పాల్గొన్నాడు. ప్రధాని సత్యసాయి డీమ్డ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలో చదివే 7వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు.
మంగళవారం వేడుకల్లో పాల్గొనడానికి కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఇప్పటికే పుట్టపర్తి చేరుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రానున్నారు. త్రిపుర గవర్నర్ కూడా వస్తున్నారు. దేశ విదేశాలనుండి ఇప్పటికే సత్యసాయి భక్తులు భారీగా చేరుకున్నారు. పుట్టపర్తిలోని హోటళ్లన్ని నిండిపోయాయి. మంగళవారం ఉదయం బాబా ప్రశాంతి నిలయం నుండి బంగారు రథంలో ఊరేగుతూ కుల్వంత్ హాలుకు చేరుకుంటారు. అక్కడ వేడుకలు జరుగుతాయి. ముఖ్యమంత్రి మంగళవారం వరకు పుట్టపర్తిలోనే ఉండి వేడుకలలో పాల్గొంటారు. మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి కూడా పాల్గొంటారు. ముఖ్యమంత్రి పుట్టపర్తిలో 60కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతారు.












Click it and Unblock the Notifications