కడప ఎంపీ జగన్ ది గురువింద గింజ సామెత: పనబాక లక్ష్మి

సోనియాకు వ్యతిరేకంగా వార్తలు సాక్షిలో రావడం విచారకరమన్నారు. సోనియాను ఎవరో పొగడాల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఓటమి ఎరుగని వ్యక్తి అని పొగిడారు. రాష్టంలోని ఇమేజ్ కి, దేశంలోని ఇమేజ్ కి తేడా ఉండుందని ఆమె చెప్పారు. అయినా సోనియాగాంధీ వంటి వ్యక్తిని విమర్శించే స్థాయి, అర్హత సాక్షి యాజమాన్యానికి లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలు చూసి ఏం చేసేవారోనని అన్నారు.
వార్తలు రాసేముందు తెలుసుకొని రాయాలన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి జగన్ కో, సాక్షికో సంబంధించిన వ్యక్తి కాదని ఆయన ప్రజల సొత్తు అని అన్నారు. వైయస్ మృతి చెందే వరకు కాంగ్రెస్ కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డియే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాడని అనడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరి నేతల్లా ఆయన పాత్ర కూడా ఉందన్నట్టు స్పందించారు.












Click it and Unblock the Notifications