వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలో ఢిల్లీ: నాయకత్వ మార్పా, వైయస్ జగన్ పై చర్యలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్రంలో ప్రధానమైన మార్పులకు శ్రీకారం చుట్టునున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమను ధిక్కరిస్తున్న వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకునే విషయంపై ప్రధానంగా కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. పోలవరంపై ప్రధానితో భేటీ మాత్రమే ఉంటుందని, సోనియాను కలవడం లేదని చిరంజీవి ఢిల్లీకి బయలుదేరే ముందు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. అయినా, రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవితో ఒప్పందం ఖరారు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. ఈ స్థితిలో రాష్టంలో నాయకత్వ మార్పుపై కూడా కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రోశయ్య స్థానంలో బలమైన నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారనే వార్తలు వస్తున్నాయి. రోశయ్య ప్రస్తుత స్థితిలో ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన అడుగుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో మంత్రివర్గ మార్పులకు పచ్చ జెండా ఊపి రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించే విషయంపై కూడా చర్చలు జరుగుతాయని అంటున్నారు. తాజా పరిణామాలపై నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నరసింహన్ నివేదిక ఆధారంగానే రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెసు అధిష్టానం ఓ అభిప్రాయానికి వచ్చి చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.

వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడం, చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకోవడం వంటి పరిణామాలతో పాటు ముఖ్యమంత్రి మార్పు కూడా అధిష్టానం ఎజెండాలో ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోవడానికి అనువైన చర్యలకు కాంగ్రెసు అధిష్టానం శ్రీకారం చుడుతుందని, అందుకే ముఖ్యమైన నేతలను ఢిల్లీకి పిలిపించిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X