వైయస్ జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీ రావాలా: ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీ రావాలా అని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రశ్నించారు. హైదరాబాదులో ఉండి కూడా ఫిర్యాదు చేయవచ్చునని, అయితే జగన్ పై ఫిర్యాదు చేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయనను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించింది. వైయస్ జగన్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఢిల్లీ రాకపై ప్రశ్నించగా ఎందుకు వచ్చారని చిరంజీవిని తాను అడుగుతానా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. చిరంజీవితో చర్చలు జరగవని ఆయన చెప్పారు.

తనకు ఎవరిపై అసహనం, కోపం లేవని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో భేటీలో వైయస్ జగన్ వ్యవహారంపై గానీ మంత్రివర్గ విషయం గానీ మాట్లాడబోనని ఆయన చెప్పారు. చిరంజీవి పర్యటనతో తనను ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. చిరంజీవి విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. తాను సోనియా, అహ్మద్ పటేల్, ఆంటోనీ, వీరప్ప మొయిలీలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం చెప్తే తాను మంత్రివర్గ విస్తరణ చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+