మఖ్యమంత్రిగా రెడ్డికే అవకాశం? వైయస్ జగన్ కు చెక్కు పెట్టేందుకే!

అయితే ఆయన్ను అడ్డుకోవటానికి రెడ్డి వర్గానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డినిగాని, శాసనసభాపతి కిరణ్ కుమార్ రెడ్డినిగాని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలున్నాయి. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణకు చెందిన పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రెడ్డిలకే అవకాశం ఇస్తున్నట్టు ఏఐసిసి వర్గాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. రేపు సాయంత్రంలోగా కొత్త ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేసే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం సిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిపై ఏకవాఖ్య తీర్మనం చేసే అవకాశం ఉంది. ఒకవేళ వైయస్ జగన్ వర్గం వారు సమావేశంలో ఏదైనా రాద్దాంతం చేసినప్పటికీ ముఖ్యమంత్రిని రెడ్డి వర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశం ఉంది. కాగా రోశయ్య రాజీనామా విషయం తెలిసిన బెంగుళూరులో ఉన్న జగన్ హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications