వైయస్ జగన్ కు చెక్: రోశయ్య ఔట్, కిరణ్ కుమార్ రెడ్డి ఇన్

ప్రస్తుత స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం అప్పగించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో తెలంగాణకు చెందిన గీతారెడ్డితో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన బొత్స సత్యనారాయణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రోశయ్య ఆరోగ్యం సహకరించకపోవడం, వైయస్ జగన్ వర్గాన్ని దీటుగా ఎదుర్కోలేకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాదులో ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశమయ్యారు. అలాగే, తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సిఎల్పీ సమావేశంలో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాదులో సమావేశమయ్యారు.
అహ్మద్ పటేల్ సిఎల్పీ సమావేశంలో ఉన్నారంటే సోనియా గాంధీ ఉన్నట్లే. వ్యవహారాలను మాత్రం ప్రణబ్ ముఖర్జీతో నడిపిస్తారు. వీరప్ప మొయిలీపై పూర్తి విశ్వాసం లేకపోవడం వల్ల కూడా వారిద్దరిని పంపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ ఉంటే వైయస్ జగన్ వర్గం పెద్ద యెత్తున గొడవ చేయడానికి వెనకాడతారని కూడా కావచ్చు.












Click it and Unblock the Notifications