గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైయస్ జగన్ రోశయ్యపై కుట్ర?

గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ కు చెందిన శాసనసభ్యులతో మాట్లాడారని కుమారస్వామి చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రతి అక్రమ వ్యాపారంలో వైయస్ జగన్ కు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వాములని, అందువల్ల రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి వారిద్దరు కలిసి కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్ రెడ్డి పాత్రతో పాటు వైయస్ జగన్ పాత్ర ఉందని, తాను, కుమారస్వామి కలిసి ఆ కుంభకోణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు. తమతో కలిసి రావాలని వారిద్దరు పరోక్షంగా చిరంజీవికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications