హైదరాబాద్లో తన అనుచర వర్గంతో వైఎస్ జగన్ భేటీ

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుచర శాసనసభ్యులు, మంత్రులు, మరికొందరితో హైదరాబాదులోని తన ఇంటిలో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. రోశయ్య తరువాత ముఖ్యమంత్రిగా అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చుండబెట్టడంపై వారు చర్చించుకన్నట్లు సమాచారం. తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రోశయ్యను దించేస్తే తర్వాత కాంగ్రెస్ పార్టికి జగనే దిక్కు అని వారు ఇన్నిరోజులు అనుకున్నారు.

అయితే వారి ఆలోచనలకు ఎదురు దెబ్బ తగిలింది. రోశయ్య స్థానంలో జగన్ కు బదులు జగన్ సామాజిక వర్గానికి, రాయలసీమకు, అందులో వైఎస్ ముఖ్య అనుచరుడైన కిరణ్ కుమార్ రెడ్డిని పీఠంపై కూర్చుండబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ తో 14 మంది శాసనసభ్యులు భేటీ అయ్యారు. జగన్ బెంగుళూరులో ఉన్నన్ని రోజులు హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కలేదు. అయితే ఆయన హైదరాబాదు రాగానే హైదరాబాద్ రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కిరణ్ ను ముఖ్యమంత్రిగా అధిష్టానం కూర్చుండబెట్టడం జగన్ కు ఇష్టం లేదన్న విషయం సాక్షి పత్రికలో కథనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన అనుచర వర్గం కూడా తమ అసంతృప్తిని బయట పెడుతుంది. జగన్ కు అధిష్టానం సముచిత న్యాయం చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. గోనె ప్రకాశరావు కూడా జగన్ తో కలిసి మాట్లాడాడు. కాగా తమకు మంత్రి పదవులు వచ్చినా రాకున్న ఫరవాలేదని జగన్ వర్గం నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+