మంత్రి పదవుల కోసం కిరణ్ కుమార్ తో చిరంజీవి బేరసారాలు

ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు తొలుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేసేందుకు కాంగ్రెసు, ప్రజారాజ్యం నుంచీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఒక దశలో పొత్తు కుదిరినట్లేనని భావించినా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో అది ఆచరణలోకి రాలేదు. తరువాత ప్రరాపా ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం బలంగా వినిపించింది. తనవర్గం ఎమ్మెల్యేలతో జగన్ పార్టీని వీడినా, సహాయ నిరాకరణ చేసినా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రరాపా ఎమ్మెల్యేల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటుందని భావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా వీరి నియోజకవర్గాల పనులు చూడమనే సందేశం కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిందని సమాచారం.












Click it and Unblock the Notifications