ఎడతెగని చిరంజీవి చర్చలు: క్యాబినెట్ లో చేరికపై మల్లగుల్లాలు

ప్రభుత్వంలో చేరితే శాసనసభ్యుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల గురించి కూడా చిరంజీవి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వంగా గీత ఇప్పటికే చిరంజీవిని హెచ్చరించినట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీలో ఉంటానని చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలను వంగా గీత ఆ వార్తలను ఖండించారు. కాగా, శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి భర్త, ప్రజారాజ్యం నాయకుడు భూమా నాగిరెడ్డి వైయస్ జగన్ ను కలిసి మంతనాలు జరిపారు. శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు మొదటి నుంచి వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థితిలో చిరంజీవి సాయంత్రం ఐదు గంటలకు శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications