వ్యూహరచనలో వైయస్ జగన్ బిజీ: ఎమ్మెల్యేలతో సమావేశం

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం బుధవారం కొలువు దీరనున్న నేపథ్యంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన వ్యూహరచనలో బిజీగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే బెంగళూర్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఆయన తన ఆంతరంగికులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సహకారం అందించడానికి, పార్టీ అధిష్టానానికి తలొగ్గడానికి ఆయన తీవ్ర విముఖతతో ఉన్నారు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటే వెంటనే తన కార్యాచరణను ప్రకటించాలని వైయస్ జగన్ భావించినట్లు తెలుస్తోంది. అయితే, అధిష్టానం తన వ్యూహాన్ని మార్చి ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనిపై వైయస్ జగన్ తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం.

వైయస్ జగన్ సోమవారం ఉదయం తనకు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం కూర్పు లోగుట్టు బయటపడిన వెంటనే తిరుగుబాటు బావుటా ఎగురేయాలని వైయస్ జగన్ వర్గం అనుకుంటున్నట్లు సమాచారం. బుధవారం నుంచే వైయస్ జగన్ తిరుగుబాటు కార్యాచరణ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఆయన సాయంత్రం కడపకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్ తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి సోమవారం ఉదయం హైదరాబాదు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+