వైయస్సార్ కుటుంబమంతా కలిసే ఉంటుంది: వైయస్ వివేకానంద రెడ్డి

వైయస్ జగన్ మామ నివాసంలో జరిగిన చర్చల్లో వైయస్ వివేకానంద రెడ్డితో సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. వైయస్సార్ సమాధి వద్ద మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఇడుపులపాయకు వైయస్ జగన్ చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి బ్రదర్స్ వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ వెంటే ఉంటానని శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications