39 మందితో కొలువు దీరిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం

మంత్రవర్గంలో ఓసీలు 22(ఇందులో ముఖ్యమంత్రి ఒకరు), బీసీలు 10, ఎస్సీలు 6, ఎస్టీలు 1, అల్పసంఖ్యాకవర్గాలు(మైనార్టీ) 1లు ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహా, పార్థసారథి, శంకరరావు ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఏరాసు ప్రతాపరెడ్డి, సుదర్శన్ రెడ్డిలు తాము ప్రమాణం చేసేటప్పుడు మంత్రిగా అనే బదులు ముఖ్యమంత్రిగా అంటూ కాస్త తడబడ్డారు. రఘువీరారెడ్డి తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.మంత్రుల ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కేవిపి రామచంద్రారావు, తెలుగుదేశం, ప్రజారాజ్యం, సిపిఎం, సిపిఐ, లోకకత్తా పార్టీ నేతలు హాజరయ్యారు. కాగా మంత్రి డికె అరుణ కూతురు పెళ్లి ఆనం రామనారాయణరెడ్డి బంధువుల పెళ్లి ఉంది. దీంతో డికె అరుణ ప్రమాణం చేసి పెళ్లికి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications